బృందావనంలో ఎక్కడ చూసినా కన్నయ్య కథలే
నా చెలికాడు నాకు నీళ్ళు తేవటానికి వెళుతుండగా ఆ సీతాకాఒక చిలుక నాతో ఒక మాటన్నది. అసలు నీకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అని. లేదన్నాను. ఎందుకు? అడిగింది. చెప్పానుకదా... అన్నాను నేను యథాలాపంగా.
కాస్త ఆగింది ఆ చిలుక మాటల మధ్యలో ఆయసం తీర్చుకునేందుకు. ఏమి చిలుకా ఇంతకుముందు అమ్మంటే యశోదమ్మే అన్నావు. అంటే ఆవిడ అంత గొప్ప అమ్మా? అడిగాను. ఊఁ అవును. అమ్మంటే యశోదమ్మే. ఎంత ప్రేమనీ కన్నయ్య మీద.
అవునా చిలుకా? అయితే ఆ కథని నాకు చెప్పవా? అడిగాను. ఇప్పుడు చెపుతున్నది ఆ కథేనమ్మాయీ. మరి అలిగిందన్నావ్? అడిగాను. అవునమ్మా. అలిగింది, ఆడిందీ పాడిందీ, అన్నీ చేసింది కన్నయ్య కోసం. నీకో విషయం చెప్పనా? ఊరిస్తున్నట్లుగా అంది.
ఊఁ చెప్పు చెప్పు. అన్నా ఆత్రంగా. అమ్మ గురించి ఎన్ని చెప్పినా నాకు తనివి తీరదు మరి. అయితే విను. ఇది అమ్మ కాబోయే నీవు శ్రద్ధగా వినాల్సిన మాట. అందా సీతాకోక చిలుక. నెను నవ్వాను. ఇంకా పెళ్ళే కాలేదు. పిల్లలెక్కడా? అన్నా నేను నవ్వుతూ. అవుతుందిలేమ్మా! అవుతుంది. అయ్యాక అమ్మ కాకుండా పోతావేంటీ? అంది మురిపెంగా మూతి తిప్పుతూ.
నేను చెప్పమన్నట్టు తలూపాను. అది చెప్పటం ప్రారంభించింది. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పటానికి ఏ భాషలోనూ పదాలు లేవు. జగత్తు అంతటికీ తల్లీ, తండ్రీ అయిన ఆ కన్నయ్యే అమ్మ ప్రేమని అనుభవించటానికి ఎన్ని అవతారాలెత్తాడొ కదా! సృష్టి స్థితి లయకారుడైన ఆ పరమాత్ముడే అమ్మ ప్రేమని అనుభవించి తదాత్మ్యం చెందాడంటేనే అమ్మ గొప్పతనం తెలుస్తుంది.
ఊఁ అన్నా పరవశంగా. ఇంతలో తను ఓరకంట చూశాడు నన్ను. చిత్రంగా నవ్వాడు. నీక మంచి కాలక్షేపం. అన్నాడు. హహహహ అంటూ ఆ సీతాకోకచిలుక నవ్వి చెప్పింది. నాకూ కాస్త నీళ్ళు పట్టుకుని రా అబ్బాయీ. సరేనని తలూపి మరో దొన్నె కోసం చూస్తున్నాడు. ఏమమ్మా చిలుకమ్మా! సీతాకోక చిలుకమ్మా! రెక్కలున్న దానివి. కాస్త ఎగిరి వెళ్ళి తాగొస్తే నీ సొమ్మేం పోయిందమ్మా. పాపం. నా బిడ్డడు సుకుమారుడు. చేతులు నొప్పెట్టవూ? అన్నా. మూతి తిప్పుతూ.
అవునా పాపం. ;-) చిన్న పిల్లడే? పిల్లతో వచ్చిన వాడు. పలు చమకులు చూపుతున్న వాడు. ఇదేనమ్మా ప్రేమంటే. అమ్మలా ఆలోచించే నెచ్చెలి దొరకటం కూడా అదృష్టమేనమ్మా! అంది మురిపెంగా నన్ను కోప్పడుతూ. మా సంభాషణ బాగుందేమో మరి తను వింటున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ.
తనది కాదమ్మా అదృష్టం. నాదమ్మా అదృష్టం. ఎంత ప్రేమనీ. నాకమ్మనిచ్చాడు తెలుసా? అన్నాను గర్వంగా.
అప్రతిభురాలయి చూసిందా చిన్ని జీవి. నా కథంతా విని మురిసి పోయింది. నన్నాశీర్వదించింది. ఏదీ నీ చెలికాడుని రానీ. ఒక్కసారి ముద్దిడనిస్తావా? అడిగింది. ఒక అమ్మలా. ఓ అన్నాను నేను.
ఇంతలో తాను రానే వచ్చాడు. చిలుక చూడనే చూసింది. ప్రేమగా తన చెక్కిలి పైన ముద్దిడింది. తను ఆ ప్రేమకి ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతలోనే తేరుకుని అన్నాడు. నాకోసం కథనాపించావా? హన్నా! భలేదానివే మరి.
తనడిగాడనీ, వచ్చేశాడనీ సీతాకోక చిలుక కన్నయ్య అల్లరి కథని మరల కొనసాగించింది.
ఇదిగో దాన్ని తనే చెప్తాడు.
దారి తప్పిన కథ - నాకోసం అమ్మ మాట
Posted by
Srujana Ramanujan
Monday, August 17, 2009
Labels: సీతాకోక చిలుకతో నా ముచ్చట
3 comments:
"అమ్మలా ఆలోచించే నెచ్చెలి దొరకటం కూడా అదృష్టమేనమ్మా", "తనది కాదమ్మా అదృష్టం. నాదమ్మా అదృష్టం. ఎంత ప్రేమనీ. నాకమ్మనిచ్చాడు తెలుసా?" - చెలిమిలో మమత, చెలికాని కొరకు చెలియలో ఓ కోణం అమ్మ, ఆమె మదిలోనూ ఓ బంధంగా ఆమెకో అమ్మ, నడుమ కన్నయ్యని కాచిన అమ్మ, చిలుక మురిపెంలో వీటన్నిటినీ అల్లిన వైనం. బాగుంది శైలి. వస్తువు చిన్నదే కాని చిత్రం మాత్రం కళ్ళకు కట్టినట్లు... కాసేపు అదోలోకంలో విహారం..
Excellent expression of love poetry. Very romantic, and sensitive.
superb అమ్మలా ఆలోచించే నెచ్చెలి దొరకటం కూడా అదృష్టమేనమ్మా"
super lines.....
www.tholiadugu.blogspot.com
Post a Comment