దారి తప్పిన కథ - నాకోసం అమ్మ మాట

బృందావనంలో ఎక్కడ చూసినా కన్నయ్య కథలే

నా చెలికాడు నాకు నీళ్ళు తేవటానికి వెళుతుండగా ఆ సీతాకాఒక చిలుక నాతో ఒక మాటన్నది. అసలు నీకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అని. లేదన్నాను. ఎందుకు? అడిగింది. చెప్పానుకదా... అన్నాను నేను యథాలాపంగా.

కాస్త ఆగింది ఆ చిలుక మాటల మధ్యలో ఆయసం తీర్చుకునేందుకు. ఏమి చిలుకా ఇంతకుముందు అమ్మంటే యశోదమ్మే అన్నావు. అంటే ఆవిడ అంత గొప్ప అమ్మా? అడిగాను. ఊఁ అవును. అమ్మంటే యశోదమ్మే. ఎంత ప్రేమనీ కన్నయ్య మీద.

అవునా చిలుకా? అయితే ఆ కథని నాకు చెప్పవా? అడిగాను. ఇప్పుడు చెపుతున్నది ఆ కథేనమ్మాయీ. మరి అలిగిందన్నావ్? అడిగాను. అవునమ్మా. అలిగింది, ఆడిందీ పాడిందీ, అన్నీ చేసింది కన్నయ్య కోసం. నీకో విషయం చెప్పనా? ఊరిస్తున్నట్లుగా అంది.

ఊఁ చెప్పు చెప్పు. అన్నా ఆత్రంగా. అమ్మ గురించి ఎన్ని చెప్పినా నాకు తనివి తీరదు మరి. అయితే విను. ఇది అమ్మ కాబోయే నీవు శ్రద్ధగా వినాల్సిన మాట. అందా సీతాకోక చిలుక. నెను నవ్వాను. ఇంకా పెళ్ళే కాలేదు. పిల్లలెక్కడా? అన్నా నేను నవ్వుతూ. అవుతుందిలేమ్మా! అవుతుంది. అయ్యాక అమ్మ కాకుండా పోతావేంటీ? అంది మురిపెంగా మూతి తిప్పుతూ.

నేను చెప్పమన్నట్టు తలూపాను. అది చెప్పటం ప్రారంభించింది. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పటానికి ఏ భాషలోనూ పదాలు లేవు. జగత్తు అంతటికీ తల్లీ, తండ్రీ అయిన ఆ కన్నయ్యే అమ్మ ప్రేమని అనుభవించటానికి ఎన్ని అవతారాలెత్తాడొ కదా! సృష్టి స్థితి లయకారుడైన ఆ పరమాత్ముడే అమ్మ ప్రేమని అనుభవించి తదాత్మ్యం చెందాడంటేనే అమ్మ గొప్పతనం తెలుస్తుంది.

ఊఁ అన్నా పరవశంగా. ఇంతలో తను ఓరకంట చూశాడు నన్ను. చిత్రంగా నవ్వాడు. నీక మంచి కాలక్షేపం. అన్నాడు. హహహహ అంటూ ఆ సీతాకోకచిలుక నవ్వి చెప్పింది. నాకూ కాస్త నీళ్ళు పట్టుకుని రా అబ్బాయీ. సరేనని తలూపి మరో దొన్నె కోసం చూస్తున్నాడు. ఏమమ్మా చిలుకమ్మా! సీతాకోక చిలుకమ్మా! రెక్కలున్న దానివి. కాస్త ఎగిరి వెళ్ళి తాగొస్తే నీ సొమ్మేం పోయిందమ్మా. పాపం. నా బిడ్డడు సుకుమారుడు. చేతులు నొప్పెట్టవూ? అన్నా. మూతి తిప్పుతూ.

అవునా పాపం. ;-) చిన్న పిల్లడే? పిల్లతో వచ్చిన వాడు. పలు చమకులు చూపుతున్న వాడు. ఇదేనమ్మా ప్రేమంటే. అమ్మలా ఆలోచించే నెచ్చెలి దొరకటం కూడా అదృష్టమేనమ్మా! అంది మురిపెంగా నన్ను కోప్పడుతూ. మా సంభాషణ బాగుందేమో మరి తను వింటున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ.

తనది కాదమ్మా అదృష్టం. నాదమ్మా అదృష్టం. ఎంత ప్రేమనీ. నాకమ్మనిచ్చాడు తెలుసా? అన్నాను గర్వంగా.

అప్రతిభురాలయి చూసిందా చిన్ని జీవి. నా కథంతా విని మురిసి పోయింది. నన్నాశీర్వదించింది. ఏదీ నీ చెలికాడుని రానీ. ఒక్కసారి ముద్దిడనిస్తావా? అడిగింది. ఒక అమ్మలా. ఓ అన్నాను నేను.

ఇంతలో తాను రానే వచ్చాడు. చిలుక చూడనే చూసింది. ప్రేమగా తన చెక్కిలి పైన ముద్దిడింది. తను ఆ ప్రేమకి ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతలోనే తేరుకుని అన్నాడు. నాకోసం కథనాపించావా? హన్నా! భలేదానివే మరి.

తనడిగాడనీ, వచ్చేశాడనీ సీతాకోక చిలుక కన్నయ్య అల్లరి కథని మరల కొనసాగించింది.

ఇదిగో దాన్ని తనే చెప్తాడు.

చిన్ని కృష్ణుని అల్లరి - యశోదమ్మ అలుక (1)



ఈ బొమ్మ తరువాతొస్తుందేఁ

వెన్న దొంగ వింత ఉపాయం

తనందుకుంటాడు! ఎంత ముద్దుగా చెప్పావ్. భలే చోట ఆపి. పోదాం పద బృందావనానికి.

నువ్వాపిన చోట నుండీ చెప్పటం నావల్ల కాదేమో. కానీ నేను ఆగలేనలా.

ఆ సీతాకోక చిలుకంది. "ఒక రోజు కన్నయ్య ఏమి చేశాడో తెలుసా?..."

"తెలీదు," అన్నాను నేను.

"నువ్వాగు చంటీ," తను అంది. నేను వినలేదు. కొంటె గా నవ్వాను. ఆ బుజ్జి స్నేహితురాలిమాటలకి నా
బంధనాలను వేస్తూనే ఉన్నాను. ఇక వల్ల కాదనుకుందేమో తను హఠాత్తుగా నా చెక్కిలి పై ముద్దిడింది.
నేనప్రతిభుడనైనాను. ఆశ్చర్యానందాలకు లోనయ్యాను. నా మీద ప్రేమా? లేక కన్నయ్య గురించి వినాలనే అతృతా?
లేకరెండూనా? ఏదైనా నాకు పరమానందమే. :-)

నేనలా ఆ అనుభూతిలో ఉండగానే ఆ చిన్ని ప్రాణి చెప్పింది.

"ఆ రోజు కన్నయ్యకి ఆకలి వేసి అమ్మని వెన్న అడిగాడు.ఇప్పుడేగా బువ్వ పెట్టాను. కాస్త ఆగు. అంది.
కానీ కన్నయ్యకి ఆకలి తనకోసం కాదు కదా. చెలికాళ్ళకోసమాయే. అందుకే "ఇంఖా ఆకలిగా ఉందమ్మా!" అరిచాడు.

పోన్లే అని యశోదమ్మ లోపలికి వెళ్ళి కాస్తంత వెన్న తెచ్చి చేతిలో పెట్టి, "ఇక వెళ్ళరా కన్నయ్యా! పనిజేసుకుని ఇల్లు సర్దుకుంటాను" అంది యశోదమ్మ.

అయితే పనైందా ఏంటి కన్నయ్యది. ఆ కాస్త వెన్న ఏమి సరిపోతుంది? అందుకే అలాగే కూచున్నాడు. ఇంకేంపని అన్నట్టు యశోదమ్మ చూసింది కన్నయ్య వైపు. అయాయకంగా మొహం పెట్టి, "ఇది చాలదే!" అన్నాడు గోముగా.

"హారి భడవా! ఇంత పెట్టినా చాలదా? నాకు తెలియదూ నీ అల్లరి! నీ నేస్తులకి కదూ. నేనివ్వ. నేనివ్వ. ఇంట్లో అన్నీ నిండుకున్నాయి. పో! పో! పోయి ఆడుకుని రా. కమ్మని గోరు ముద్దలు పెడతాను."

హ్మ్! అమ్మని అడిగితే ఇంతే అని చిన్ని కృష్ణుడు ఏమి చేయాలా అని ఆలోచిస్తూ అలా అలా అడుగులు వేసుకుంటూ బయటకి నడిచాడు. అసలే పని కాలేదని ఉక్రోషం. ఆపైన ఎండ. చెప్పులు మరిచాడాయే. పాపం! కాళ్ళు కాలాయి. వెంటనే పరిగేట్టుకుని వెళ్ళి నాన్న చెప్పులేసుకుని పెద్ద ఆరిందాలా నడుచుకుంటూ తన నేస్తుల దగ్గరికి వెళ్ళాడు.

"కిట్టయ్యా! ఏమన్నా తెచ్చావా?" ఆశగా అడిగారు నేస్తులు. లేదన్నట్టు తలూపి ఒక మంచి ఉపాయం చెప్పాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళి అక్కడ అడగాలని, ఆ పన్నాగం పారనిదే ఇంకోలా చేద్దామనేది కిట్టయ్య ఆలోచన. భలే అంటే భలే అనుకున్నారంతా.

అసలు ఉపాయం ఇదీ........

ముందు కన్నయ్య వెళ్ళి ఆ ఇంట్లో వెన్న మీగడలని నందుడడిగినట్లే అడుగుతాడు.అందుకా చెప్పుల సవ్వడే చాలని ఉపాయం. ఒకవేళ అది కుదరకపోతే ఎప్పటిలానే వెన్న దొంగ అవతారమే!

సరే కాసేపు ఆగారంతా. ముందుగా కన్నయ్య వెళ్ళి గంభీరంగా ఇంట్లో వెన్నమీగడలు నిండుకున్నాయనీ, కాస్త మా కన్నయ్యకి పెట్టేందుకు ఇమ్మనీ అడిగాడు. అనుమానంలేని ఆ ఇల్లాలు రెండు కుండల నిండా వెన్నమీగడలు తెచ్చింది. నంద మహారాజులవారు స్వయంగా అడిగారని. పాపం... ఆ అమాయక పడుచుకేమి తెలుసు ఇది మహా మాయగాడైన ఆ నంద కిషోరుని పని అనీ...

సీతాకోక చిలుక చెప్పుకుని పోతూనే ఉంది. మేము వింటూనే ఉన్నాము. ఇంతలో తనకి దాహమయింది. ఆ కనిపించే యమునలో నీరు తెద్దామని నేను లేచి, " ఓ చిలుకమ్మా! కాస్త పెద్దగా చెప్పమ్మా! నేను నా నెచ్చెలికి నీళ్ళు తెస్తాను. మరి నాకు వినపడాలి," అంటూ అలా నడిచానో లేదో...

ఏమైందో ఇప్పుడు తనందుకుంటుంది.

(మా ప్యూర్ immagination తో వ్రాస్తున్న ఈ కథలలో బొమ్మలు కావాలి. సహృదయులైన కృష్ణ భక్తులెవరైనా ఈ కథకి తగ్గ బొమ్మని అందించగలరా?)

అమ్మంటే యశోదమ్మే!



వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. చిరుజల్లులు పలకరిస్తుంటే తనువు పులకరిస్తున్నది.

చిరునవ్వొకటి రువ్వాడు. నా మది మది పైన పడేలా. చిన్నపిల్లాడిలా. ముచ్చటగా అనిపించి బుగ్గలు పుణికాను. అదోలా కళ్లు మూసుకుని రమ్మన్నట్టు చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు నన్ను.

ఎక్కడికని అడగలేదు నేను. అలా నడిపించుకుంటూ వెళ్తుంటే నేను కూడా ఆ అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వెళ్లాను. ఆ స్పర్శ నాలో ఒక ఐకాన్ని కలిగిస్తుంటే తనువంత హాయిగా ఉంది. ఎదురుగ అందమైన నది. తీరానే చెట్లు. చెట్లు, పండ్ల చెట్లు. చెప్పలేను కానీ, అదొక నందన వనం లా ఉంది. నందనవనం ఏమిటి?

"ఇది నందనవనమే," అన్నాడు తను.

"బృందావనమా?"

"అవును. యమునాతీరం."

అలా వెళ్లి ఒక చెట్టుకింద కూచున్నాం. వానజల్లులు తగ్గి, పూల జల్లులు కురిశాయి. మాకు ఆహ్వానం పలికాయి. ఎదురుగా నది. పక్కన ప్రియ సఖుడు. సాక్షాత్ బృందావనమే. ఎంత అదృష్టం చేసుకున్నానీవేల? ఎంత మధురమైన అనుభూతి నాకు సొంతమైంది? ధీర సమీరం. యమునాతీరం.

ఆహాహా! మనసు పులకరించిన వేళ ఎదురుగా కృష్ణుడు కనబడ్డాడు. చిన్న పిల్లాడిలా. ఆ నల్లనయ్య చిలిపి పనులు గుర్తొచ్చాయి.

అంతలోనే ఒక తీపి జ్ఞాపకం. ఎవరో అన్నారు తనతో. "నీకు నల్ల పిల్ల వస్తుంది."

"నల్ల పిల్లయితే మంచిదేగా? చెడ్డపిల్ల కాకుండా." ఎంత ముద్దుగా అన్నాడు. సరే కృష్ణుడి విషయానికి వద్దాం.

కృష్ణుడు అంటే ఎందుకంత ఇష్టం చాలా మందికి? ఎందుకంత ఆకర్షణ పెక్కు మందికి? ఆழ்వార్లకి , పిల్లలకి, పెద్దలకి, మిత్రులకి... మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుండగా అన్నాడు. నా మనసుని పసిగట్టినట్టు. "శత్రువులకి కూడా. అందుకే కోరి మరీ ఆయన చేతుల్లో మరణించారు."

నేను నవ్వాను. ఒక సీతాకోక చిలుక మా ముందుకు వచ్చింది. అదీ నవ్వింది. "ఎందుకలా నవ్వావ్?" అడిగాడు.

"నీ మాటలకి," జవాబిచ్చింది.

తనూ నవ్వాడు. చిలిపిగా. కళ్ళార్పుతూ.

"ఎందుకలా నవ్వావ్?" అడిగింది.

"నువ్వు నవ్వినందుకే."

"అంటే నా మాటలకి నవ్వొచ్చిందా?"

"లేదు. నీ భావం అర్ధం అయ్యి నవ్వాడు."

"ఏమిటి నా భావం?"

"అందమైన ప్రకృతిని, ఇష్ట సఖిని వెంటనుంచుకుని, ఎందుకలా మాటలతో వెల్ల బుచ్చుతావు?" అనేగా నువ్వు నవ్వింది? అన్నాను.

మళ్ళీ నవ్విందది.

"భలే పట్టావే?" అంది. "చూశావా అదే కృష్ణుడి గొప్పతనం."

"అవును కదూ," అన్నాడు.

"అవును. అబ్బాయీ, నీకో విషయం చెప్పాలి. నువ్వు అమ్మ గురించి చెపితే విన్నాను. మరి ఇంకో అమ్మ గురించి చెప్పనా?"

"చెప్పు," అన్నాను ఆత్రంగా. అమ్మని చూడని నిర్భాగ్యురాలిని. నా భావం పసిగట్టాడేమో? అన్నాడు. "అమ్మ ఉంటమే కాదు. అమ్మ అవటమూ భాగ్యమే. ఆ భాగ్యం లేదు కనుకే పురుషులు మందభాగ్యులు."

కిలకిలా నవ్వింది ఆ సీతాకోక చిలుక. అంతే. తన మాటలు నవ్విస్తాయి. మురిపిస్తాయి. మైమరపిస్తాయి. ఆలోచింప జేస్తాయి.

"సరే! ఆ అమ్మ ని గురించి చెప్పు." నా వళ్ళొ తల పెట్టుకుని వింటున్నాడు. ఆ అందమైన సీతాకోక చిలుక చెప్పసాగింది.

"అమ్మంటే... యశోదమ్మే."

"ఎందుకు?" ప్రశ్నించటం తనకలవాటు.

"నిజం అమ్మంటే యశోదమ్మే! నీకు తెలుసా? బిడ్డని కాచటమే కాదు. సుద్దులు చెప్పి చెడు బారిన పడకుండా కాపాడేదీ అమ్మే......."

S
.

ఇక్కడి నుంచీ తనన్దుకుంటాడు. రేపు ఈవేళకి.